జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: జగిత్యాల

జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, ఈ-చలాన్ విధానంపై సమీక్ష జరిపినట్లు SP JAGTIAL వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రజా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.