'అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు': కాంగ్రెస్ సర్కార్‌పై బత్తుల సుదర్శన్ ధ్వజం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిలదీసే హక్కును అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం అప్రజాస్వామికమని మండిపడుతూ, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, ముందస్తు అరెస్టుల పర్వాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.