ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సిద్ధమైన అధికార యంత్రాంగం

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం ఐదు గంటలతో అభ్యర్థుల ప్రచార గడువు ముగియగా నవంబర్ ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. నవంబర్ మూడో తేదీన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.