అసెంబ్లీలో ఉద్రిక్తత, భావోద్వేగానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభ సమావేశాల తొలి రోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్ల టీషర్టులతో వెళ్లిన భారాస నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు. స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగగా, చర్చ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.