పేదలు ఆనందంగా జీవించడమే నిజమైన అభివృద్ధి అంటూ దేవినేని ఉమా వ్యాఖ్య
రిపోర్టర్: మహేష్
స్థలం: ఎన్టీఆర్
డబ్బున్నవాడు కాకుండా పేదలు ఆనందంగా జీవించడమే నిజమైన అభివృద్ధి అని, అదే తమ కూటమి ప్రభుత్వ సిద్ధాంతమని మాజీ మంత్రి, మైలవరం నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పేదలకు పట్టాభిషేకం, మీ ఇల్లు మీ హక్కు అనే నినాదాలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వమని కొనియాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో పేదల సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు అమలవుతున్నాయని, సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.