అమరావతిలో కేంద్ర కరువు అధ్యయన బృందంతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Amaravati
అమరావతిలో సీఎం చంద్రబాబుతో కేంద్ర కరువు అధ్యయన బృందం కీలక భేటీ నిర్వహించిందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలను ఈ సమావేశంలో ఆ బృందం ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, రైతులను ఆదుకోవడానికి తక్షణ సహాయం అందించాలని కేంద్ర బృందానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.