తెలుగులో 'హనుమాన్ అంశ్' విడుదల చేయనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘హనుమాన్ అంశ్’ తెలుగులోకి రానుంది. హిందీలో ఘన విజయం సాధించిన ఈ భక్తి చిత్రానికీ టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు విడుదల బాధ్యతలు తీసుకున్నారు. నిర్మాత నమ్రతా సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే అధికారిక విడుదల తేదీ వెలువడనుంది.