ఆసియా క్రీడలకు పీవీ సింధు సపోర్ట్ స్టాఫ్‌కు ఆమోదం

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

ఆసియా క్రీడల్లో పతక పోరుకు సిద్ధమవుతున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. ఆమె వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ హీరా ముండ్లూరు, కోచ్ శ్రేయసి సంజయ్, సింగిల్స్ కోచ్ మహమ్మద్ ఇర్వాన్యాŠస్‌ల పేర్లను ఆమోదించింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ సిఫార్సు చేయకపోయినా మంత్రిత్వ శాఖ సింధు సహాయక సిబ్బందికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.