తెలంగాణలో కరెంటు కోతలతో ఎండుతున్న వ్యవసాయ పంటలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: నల్లగొండ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల కరెంట్ పోయి, కేవలం 8 గంటలకే పరిమితం కావడంతో పాటు అప్రకటిత కోతలు, లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయి. పంటలు ఎండుతుండటంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు సబ్‌స్టేషన్ల ఎదుట రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.