పెళ్లి చూపులు హిట్ ఎలా అయిందో నాకే తెలీదన్న తరుణ్ భాస్కర్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

పెళ్లి చూపులు సినిమా ఎలా హిట్ అయిందో ఇప్పటికీ తనకు తెలీదని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆ సినిమా విజయం తర్వాత వచ్చిన తీవ్రమైన ఒత్తిడిని తట్టుకునేందుకే ఈ నగరానికి ఏమైంది సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టం చేశారు. కష్టకాలంలో బంధువులు దూరంగా ఉంటే, స్నేహితులు మాత్రమే తనకు అండగా నిలిచారని ఆయన వెల్లడించారు.