పోలీసింగ్లో నాయకత్వ ప్రాధాన్యతపై ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ సమావేశం

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నూట పన్నెండు మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసింగ్లో నాయకత్వ ప్రాధాన్యతపై దిశానిర్దేశం చేస్తూ కీలక ప్రసంగం చేశారు. నాయకత్వం అనేది కేవలం పదవి లేదా అధికారంతో రాదని, అది ధైర్యం, దూరదృష్టి, నిజాయితీ, సమిష్టి కృషితో మాత్రమే సాధ్యమవుతుందని డీజీపీ స్పష్టం చేసినట్లు టీజీ పోలీస్ వెల్లడించారు. ఈ సమావేశంలో అధికారుల విధులు, బాధ్యతలపై చర్చించారు.