ఈడీ ఉచ్చు: భారీ పెట్టుబడుల మోసం కేసులో ఎనభై ఐదు కోట్లు జప్తు
రిపోర్టర్: సురేష్
స్థలం: Chennai
పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసిన డ్రీమ్ మేకర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన సుమారు ఎనభై ఐదు కోట్ల పందొమ్మిది లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేసినట్లు తాజాగా వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, నిందితులు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల మేర అక్రమంగా నిధులను సేకరించి మళ్లించినట్లు గుర్తించి ఈ కీలక చర్యలు చేపట్టారు.