మనుబోలు అంబేద్కర్ నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ వకీల్ పేట రాజా వీధిలో ఏర్పాటు చేసిన గణేశుని మండపం వద్ద అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఉభయదాతలుగా చింతల హనుమంతు లతా, అరవ శ్రీనివాసులు ప్రమీల కుటుంబ సభ్యులు పాల్గొని భక్తిని చాటుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.