డీఎస్సీ టీచర్లపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: శివ
స్థలం: కుప్పం
కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడులను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నినదిస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆయన, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.