పారిస్ ఫ్యాషన్ వీక్లో మెరిసిన నటి ఐశ్వర్య రాయ్
రిపోర్టర్: నరేష్
స్థలం: ముంబై
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ వేదికపై నల్లటి దుస్తుల్లో ప్రత్యక్షమై అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక రూపంతో అందాల ఆరబోత చేశారు. అయితే ఆమె రూపురేఖల్లో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. యాభై రెండు సంవత్సరాల వయసులోనూ ఆమె గ్లామర్ తగ్గలేదని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఆమె చాలా మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు అంతర్జాలంలో వైరల్గా మారాయి.