వైన్ షాప్‌లోకి దూరి మద్యం తాగి గాఢ నిద్రలోకి జారుకున్న కోతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: రాంచీ
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓర్మాంఝీ బ్లాక్ చౌక్ వద్ద ఓ వైన్ షాప్‌లోకి దూరిన కోతి మద్యం సేవించి మత్తులో అక్కడే నిద్రపోయినట్లు స్థానికులు తెలిపారు. షాప్‌లోకి ప్రవేశించిన కోతి మద్యం సీసాను తెరిచి తాగిందని, ఆ తర్వాత మత్తు ఎక్కడంతో అక్కడి కాటన్లపైనే గాఢ నిద్రలోకి జారుకుందని పేర్కొన్నారు. ఈ విచిత్ర ఘటనను చూసి షాక్ తిన్న స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని కోతికి ఎలాంటి హానీ కలగకుండా సురక్షితంగా బయటకు తరలించారు.