దిగ్గజ నటుడు ఫిరోజ్ ఖాన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంజయ్ గుప్తా

రిపోర్టర్: వెంకట్ స్థలం: ముంబై

దిగ్గజ నటుడు ఫిరోజ్ ఖాన్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రముఖ సినీ దర్శకుడు సంజయ్ గుప్తా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆదివారాల్లో పని చేయననే నిబంధన కారణంగా ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్తో కలిసి నటించాల్సిన హేరా ఫేరి సినిమాను ఫిరోజ్ ఖాన్ వదులుకున్నారని తెలిపారు. తొలి రోజుల్లో తనకు అవకాశం కల్పించిన చిన్న చిత్రాల దర్శకులను ఆయన ఎప్పుడూ గుర్తుంచుకునేవారని, కృతజ్ఞతా భావం కలిగిన నిజమైన జెంటిల్మన్ అని సంజయ్ గుప్తా కొనియాడారు.