ఎన్టీఆర్ జిల్లాలో రాత్రి గస్తీ ముమ్మరం: భద్రతపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి

రిపోర్టర్: హరి స్థలం: ఎన్టీఆర్

ప్రజలకు భద్రత, భరోసా కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లాలో రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసినట్లు విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. వాహనాలతో ముమ్మర గస్తీ నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రత తమ ప్రథమ ప్రాధాన్యమని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.