షాకింగ్ ఘటన: గ్వాలియర్లో బీటెక్ గ్రాడ్యుయేట్ వినూత్న దొంగతనాలు బట్టబయలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Gwalior

గ్వాలియర్ మరియు ఝాన్సీ మధ్య రైళ్లలో ఏసీ కోచ్లను టార్గెట్ చేస్తూ ప్రయాణికుల లగేజీని దొంగిలిస్తున్న ముప్పై ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్ దీపక్ మౌర్యను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గర్ల్ఫ్రెండ్ కోరికలను తీర్చడం కోసం ఈ నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.