కాల్వపల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఉట్టి కొట్టిన యువకులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గుర్రంపోడ్

గుర్రంపోడు మండల పరిధిలోని కాల్వపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. సర్పంచ్ పంగ కళమ్మ యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చీరబోయిన విఘ్నేష్ ఉట్టి కొట్టి విజేతగా నిలిచారు.

చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించగా, భజనలు, భక్తిగీతాలతో గ్రామం పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొంత దేవేందర్, మాజీ సర్పంచ్ కౌసల్య భాస్కర్రెడ్డి, యాదవ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణుడిని స్మరించుకున్నారు.