'కోవూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటన': పసుపుమయమైన కోవూరు
రిపోర్టర్: నరేష్
స్థలం: కోవూరు
మంత్రి నారా లోకేష్ కోవూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా నియోజకవర్గమంతా పసుపుమయంగా మారింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య పర్యటన ఉత్సాహంగా కొనసాగింది.