క్రమం తప్పని వ్యాయామంతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని రమేష్ గాజుల వెల్లడి
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
ప్రతి రోజు క్రమం తప్పని వ్యాయామం చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా పదిలంగా ఉంచుకోవచ్చని ఒమేగా అను హాస్పటల్స్ ఛైర్మన్ రమేష్ గాజుల వెల్లడించారు. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా విజయవాడలోని పీబీ సిద్ధార్థ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు హార్ట్ పాస్పోర్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మారిన జీవనశైలి కారణంగా వస్తున్న గుండె జబ్బులపై వైద్యులు పలు కీలక సూచనలు చేశారు. నడకతో పాటు మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.