అమెరికా సాట్ పరీక్షలో ప్రవాస బాలుడి అరుదైన ప్రతిభ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: గుంటూరు

అమెరికాలో నిర్వహించిన స్కూల్ అసెస్మెంట్ టెస్ట్ (సాట్)లో ప్రవాస తెలుగు బాలుడు అశ్రిత్ తాళ్లూరి అద్భుత ప్రతిభ కనబరిచాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అశ్రిత్.. పద్నాలుగేళ్ల వయసులోనే 1,600 మార్కులకు గాను నూరు శాతం స్కోరు సాధించాడు. భవిష్యత్తులో ప్రముఖ న్యూరోసర్జన్ అవుతానని, తన తాత కోరికను నెరవేరుస్తానని అశ్రిత్ వెల్లడించాడు. అశ్రిత్ సాధించిన ఈ ఘనతపై ప్రవాసాంధ్రులు, స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు.