ధర్మవరంలో ఉద్రిక్తత: మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ, వైఎస్సార్సీపీ వర్గాల ఘర్షణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ధర్మవరం

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకుల హడావిడిపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ తలెత్తిందని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.