వైసీపీకి షాకిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నవీన్ నిశ్చల్ రాజీనామా

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత, మాజీ ఇన్చార్జ్ నవీన్ నిశ్చల్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన, ఈ నిర్ణయం తీసుకోవడంతో స్థానిక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసిన ఆయన, గత కొంతకాలంగా నెలకొన్న అసంతృప్తితో ఈ అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది.