రాయలసీమ టన్నెల్‌తో విజయవాడకు శరవేగంగా ప్రయాణం

రిపోర్టర్: రాము స్థలం: వైయస్సార్ జిల్లా

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా పోరుమామిళ్ల సమీపం నుంచి నెల్లూరు జిల్లా సీతారామపురం మధ్య ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. నల్లమల అడవులు, ఘాట్ రోడ్డు ప్రయాణ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గం ద్వారా రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.