అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రపై వైసీపీ నేతల దాడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా పరిషత్ ఎన్నికల వేళ కుందుర్పి మండలం బెస్తరపల్లి పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రపై వైసీపీ నేతలు దాడికి యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఓటర్లను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యేపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడగా, అడ్డుకున్న గన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.