ప్రకాశం జిల్లాలో వైకాపాకు ఎదురుదెబ్బ తెదేపాలో చేరిన ముప్పై కుటుంబాలు
రిపోర్టర్: హరి
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరానికి చెందిన 30 కుటుంబాలు వైకాపాను వీడి సోమవారం తెదేపా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సమక్షంలో తెదేపాలో చేరాయి. ఈ సందర్భంగా లక్ష్మి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా తాళ్లూరు మండలాధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.