ఎమ్మెల్సీ ఓటు నమోదు రుసుము వసూలు ఆపాలని యంగల ఆనందరావు డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బోనకల్
బోనకల్ మండలంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు పేరుతో మీసేవ కేంద్రాల్లో రూ.100 వసూలు చేయడంపై సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లపై ఈ రుసుము అదనపు భారంగా మారుతోందని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్య హక్కు అయినందున ప్రభుత్వం ఉచితంగా ఓటు నమోదు ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ చెల్లూరి సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు.