'స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతం': సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రాము
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి కృప వల్లనే తనకు ప్రాణభిక్ష లభించిందని, భక్తుల సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు తిరుమలను నెట్ జీరో క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు వేగవంతం చేశామని పేర్కొన్నారు. అలాగే రూ.10 కోట్లతో 5,000 కొత్త ఆలయాల నిర్మాణం, ఉద్యోగుల సంక్షేమం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.