జేసన్ సంజయ్ సిగ్మా మూవీ ట్రైలర్‌ను ప్రశంసించిన రాజమౌళి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చెన్నై

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమా సిగ్మా. ఈ చిత్ర ట్రైలర్‌ను చూసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసించారు. ఇది ఒక ఫన్ అడ్వెంచర్ రైడ్ అని కొనియాడుతూ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ సినిమా అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.