సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిపై దాడి కలకలం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలంగాణలోని హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పీఏపై దాడి జరిగిందనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసుల వేషంలో వచ్చి దాడి చేశారని బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను సైఫాబాద్ పోలీసులు పూర్తిగా ఖండించారు.