తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత దేశ ఉప రాష్ట్రపతి
రిపోర్టర్: సునీల్
స్థలం: తిరుపతి
భారత దేశ ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకుని, ఆ తర్వాత ఆలయ మర్యాదల నడుమ శ్రీవారి ప్రధానాలయానికి చేరుకున్నారు. దేశ ప్రజల శ్రేయస్సును కోరుతూ ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందజేయగా, అధికారులు తీర్థప్రసాదాలు బహూకరించారు.