మహిళలకు ఇళ్ల పట్టాలతో చంద్రబాబు మేలు చేశారన్న గోరంట్ల బుచ్చయ్య
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తూర్పు గోదావరి
మహిళల పేర్లపై ఇళ్ల పట్టాలు అందించి సొంతింటి హక్కు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళలకు ఆయన కొండంత అండగా నిలుస్తున్నారని, విజన్ ఉన్న నాయకుడని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపించుకున్నారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.