అజ్నార్ నదిని శుభ్రం చేసిన యువకుడికి అంతర్జాతీయ సంస్థ పిలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇతని కృషిని గుర్తించిన 'ది ఓషన్ క్లీనప్' వ్యవస్థాపకుడు బోయన్ స్లాట్, తన సంస్థలో చేరాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆహ్వానించారు. గతంలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇతని పట్టుదలను ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ యువకుడు చేస్తున్న కృషి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.