కుష్టు వ్యాధి నిర్మూలనకు ఇంటింటి సర్వే: మంచిర్యాలలో వైద్య శాఖ సన్నాహాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ నాల్గవ తేదీ వరకు మంచిర్యాల జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రీ ఓరియంటేషన్ శిక్షణలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా వెళ్లి లక్షణాలను గుర్తించాలని ఆయన సూచించారు.