టెక్ ప్రపంచంలో సంచలనం: గెలాక్సీ జెడ్ ఫోల్డ్ తొమ్మిది కెమెరా వివరాలు లీక్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ నుంచి రానున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ తొమ్మిది మరియు అల్ట్రా స్మార్ట్ ఫోన్ల కెమెరా వివరాలు ఆన్ లైన్ లో లీకయ్యాయని టెక్ నిపుణులు తెలిపారు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ తొమ్మిది మోడల్ లో గతంలో మాదిరిగానే డ్యూయల్ కెమెరా సెటప్ కొనసాగనుందని పేర్కొన్నారు. అల్ట్రా వెర్షన్ లో రెండు వందల మెగాపిక్సెల్స్ ప్రధాన కెమెరాను అమర్చనున్నట్లు లీకైన సమాచారం ద్వారా స్పష్టమవుతోంది.