అన్నదాతల ఆక్రోశం: తెలంగాణలో కరువు ముప్పుపై కేంద్రానికి నివేదిక
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ నెల 31 లోగా 358 మండలాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలు సరిగ్గా కురవక పత్తి పంట దెబ్బతినడం, వరి పొలాలు ఎండిపోవడంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, 324 మండలాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోయాయని అధికారులు వెల్లడించారు.