అంబేద్కర్ ను అవమానించే పుస్తకంతో బీజేపీకి సంబంధం లేదు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను కించపరిచేలా ప్రసాద్ అనే వ్యక్తి రాసిన పుస్తకంతో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఆ మహనీయుడిని అవమానించేలా ఉన్న ఆ పుస్తకాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి ప్రజా నాయకులు బస్తీల్లో ఎంతో మందిని కలుస్తూ ముందుకు సాగుతున్నారని స్పష్టం చేసింది.