హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపాలు: ప్రయాణికులకు తప్పని తీవ్ర ఇబ్బందులు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ విధానంలో నెలకొన్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. డిజిటల్ లేదా పేపర్ టికెట్లలో ఎక్కే, దిగే స్టేషన్లు మారినప్పుడు ఆటోమేటిక్ గేట్లు వాటిని గుర్తించలేకపోతున్నాయని వెల్లడించారు. రద్దీ సమయాల్ లో ఈ సమస్య మరింత పెరుగుతోందని, స్టేషన్ కంట్రోలర్లను సంప్రదించి గేట్లు ఓపెన్ చేయించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ, మెట్రో యాజమాన్యాలు ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.