పెద్దపల్లి రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఎన్నికైంది. శనివారం జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా ఎరబటి వెంకటేశ్వర రావు, వైస్ చైర్మన్గా సాధుల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా పంపటి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కావేటి రాజగోపాల్ బాధ్యతలు చేపట్టారు. ఈ నూతన కమిటీ పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుందని ఎన్నికల కార్యాలయం స్పష్టం చేసింది.