కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్: రాజీనామా చేసి తేల్చుకుందాం రండి
రిపోర్టర్: సునీల్
స్థలం: నల్గొండ
నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్‌ను తులసి వనంలో గంజాయి మొక్కలా పీకి పారేస్తామన్నారు. ధైర్యముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, లేదంటే గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్దిపేటలపై దండయాత్ర చేస్తామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 90కి పైగా స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.