సికింద్రాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణలు: అడ్డాల పేరుతో అంతులేని వసూళ్ల దందా

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్ లో ఫుట్పాత్లు ఆక్రమణలకు గురికావడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, బస్ షెల్టర్లను కబ్జా చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, అనధికారిక వ్యక్తులు అడ్డాల పేరుతో రోజువారీగా భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై పోలీసు అధికారుల ప్రమేయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయని, ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.