ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రథమ పూజ్యుడైన శ్రీ గణేశుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి అఖండ విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.