టెక్నాలజీతో లీకేజీలకు చెక్: పరీక్షల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై నందన్ నీలేకని సూచనలు
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని సూచించారు. బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, పరీక్ష జరిగే రోజే ఏఐ సాయంతో ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానాన్ని పరిశీలించాలని కోరారు. ముందుగానే ప్రశ్నపత్రాలను తయారు చేసి భద్రపరిచే పద్ధతికి బదులుగా, చివరి నిమిషంలో ప్రశ్నలను ఎంపిక చేసి పేపర్ తయారు చేస్తే అక్రమ ప్రయత్నాలకు అవకాశాలు పూర్తిగా తగ్గుతాయని స్పష్టం చేశారు.