మల్లారెడ్డి ఫామ్ హౌస్ పై హైడ్రా కొరడా: ప్రహరీ గోడల కూల్చివేత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

హైదరాబాద్ శివారులోని కొంపల్లి ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన ఫామ్హౌస్ ప్రహరీ గోడలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువు భూములను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఈ కట్టడాలపై రెవెన్యూ, హైడ్రా సిబ్బంది ఉక్కుపాదం మోపారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చెలరేగింది. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.