భారతీయ మార్కెట్లలోకి సిటీ సంస్థ సరికొత్త విదేశీ పెట్టుబడి సేవలు
రిపోర్టర్: హరి
స్థలం: ముంబై
భారతీయ మూలధన మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను మరింత వేగంగా ఆకర్షించేందుకు ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఈఎఫ్‌పీఐ ఎట్ సిటీ సేవలను ఆవిష్కరించింది. సెబీ మరియు ఎన్‌ఎస్‌డీఎల్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తెచ్చిన ఈ డిజిటల్ విధానం ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ కేవలం ఐదు పని దినాలలోనే పూర్తికానుంది.