సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కారు దగ్ధం డాక్టర్ సజీవదహనం

రిపోర్టర్: సునీల్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో కారు దగ్ధం కాగా, లోపల చిక్కుకున్న ఖమ్మం మమత ఆస్పత్రి న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.