వైద్య సేవల మెరుగుకు రామగుండం ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పునరుద్ధరణ పనులు, ఓపీ, ఐపీ సేవలను పరిశీలించి వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. సర్జరీలు, ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నూతన భవనం వద్ద రోడ్లు, లైటింగ్ సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.