కల్తీ దందా గుట్టురట్టు: కోటి నలభై లక్షల విలువైన సరకు సీజ్

రిపోర్టర్: సురేష్ స్థలం: కడప

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్ల గుట్టును విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రట్టు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని జ్యోతి కంపెనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సుమారు కోటి నలభై లక్షల విలువైన హానికర రసాయన సరకును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పాత ధనియాలకు రసాయనాలు కలిపి కొత్తవాటిలా విక్రయిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.